ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కలవరం: 24గంటల్లో వెయ్యికి చేరువగా కేసులు

ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ టీకా తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

కరోనా కలవరం: ఒక్క రోజులో 984 కరోనా కేసులు
కరోనా కలవరం: ఒక్క రోజులో 984 కరోనా కేసులు

By

Published : Mar 26, 2021, 6:57 PM IST

రాష్ట్రం‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 984 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 8,96,863 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,203కు చేరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 306 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,145 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,49,16,201 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 163.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో నాలుగు జిల్లాల్లో వందకుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే..


ఇవీ చదవండి

విజయవాడలో మత్తు పదార్థాలకు బానిసైన యువకులకు కౌన్సిలింగ్

ABOUT THE AUTHOR

...view details