Telangana Corona Cases Today : రాష్ట్రంలో కొత్తగా 658 కొవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,10,976కు పెరిగింది. తాజాగా మరో 628 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,02,354 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 19న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు.
(Covid case) తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
Telangana Corona Cases Today : తెలంగాణ లో నమోదు అవుతున్న కరోనా కేసులు మరోసారి భయపెడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 658 కొవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,10,976కు చేరినట్లు తెలిపింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లోనే కొత్తగా 316 పాజిటివ్‌లు నిర్ధారణ అయినట్లు పేర్కొంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 4,511 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,552 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,60,95,926కు పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో కొత్తగా 316 పాజిటివ్‌లు నిర్ధారణ కాగా.. కరీంనగర్‌లో 18, ఖమ్మంలో 30, మంచిర్యాలలో 10, మేడ్చల్ మల్కాజిగిరిలో 41, నల్గొండలో 21, పెద్దపల్లిలో 25, రంగారెడ్డిలో 52, సంగారెడ్డిలో 16, యాదాద్రి భువనగిరిలో 11 మంది చొప్పున కొత్తగా కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో మరో 53,063 కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేయగా.. ఇందులో బూస్టర్ డోసులు 45,593 నమోదయ్యాయి.