ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో మరో 310 మందికి కరోనా పాజిటివ్ - COVID CASES

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 310 మందికి కొవిడ్ సోకింది. అత్యధికంగా చిత్తూరులో 51, అత్యల్పంగా విజయనగరంలో 7 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 114 మంది కోలుకోగా... కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా లెక్కలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,94,044కి చేరింది.

రాష్ట్రంలో మరో 310 మందికి కరోనా పాజిటివ్
రాష్ట్రంలో మరో 310 మందికి కరోనా పాజిటివ్

By

Published : Mar 22, 2021, 8:06 PM IST

రాష్ట్రంలో మరో 310 మందికి కరోనా పాజిటివ్

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 35,375 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 310 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు కేసులు నమోదు కాలేదు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51, అత్యల్పంగా విజయనగరంలో 7 మందికి వైరస్ సోకినట్లు పేర్కొంది. కర్నూలు 21, తూర్పుగోదావరి, విశాఖపట్నం 43, గుంటూరు 28, అనంతపురం, కృష్ణా 26, నెల్లూరులో 13, ప్రకాశంలో 12, కడప, శ్రీకాకుళంలో 20 చొప్పున కొవిడ్ నిర్ధరణ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలో వైరస్‌ నుంచి మరో 114 మంది బాధితులు కోలుకోగా మరో ఇద్దరు మరణించారు. తాజా గణాంకాలతో కలిపి.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,94,044 మందికి కొవిడ్ సోకింది. 7,191 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2,382 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details