రాష్ట్రంలో కరోనా కేసుల తగ్గుదల కొనసాగుతోంది. కొత్తగా 40 వేల 728 కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా 381 మందికి పాజిటివ్‌గా తేలింది. అనంతపురం, చిత్తూరు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మెుత్తం నలుగురు కరోనా కాటుకు బలయ్యారు.
రాష్ట్రంలో కొత్తగా 381 కరోనా కేసులు, 4 మరణాలు - కోవిడ్ -19 తాజా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 381 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,68,064 కి చేరింది. తాజాగా మహమ్మారి బారిన పడి మరో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,992కి చేరింది
రాష్ట్రంలో కొత్తగా 381 కరోనా కేసులు, 4 మరణాలు
వీరితో కలిపి మెుత్తం 6 వేల 992 మంది కన్నుమూశారు. ఇప్పటివరకూ కరోనా బారినపడ్డ వారి సంఖ్య 8 లక్షల 68 వేల 64 కి చేరింది. 8 లక్షల 53 వేల మందికిపైగా కోలుకున్నారు. ప్రస్తుతం 7 వేల 840 యాక్టివ్ కేసులున్నాయి.
ఇవీ చదవండి: