రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది. మొత్తంగా ఇప్పటివరకు 8 లక్షల 67వేల 683మందికి కరోనా సోకింది. కొత్తగా 24గంటల వ్యవధిలో 54 వేల 710మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 620మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరించారు. వైరస్ కారణంగా ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.... మెుత్తం మరణాల సంఖ్య 6,988 చేరింది. 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 107 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 101మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో కొత్తగా మరో 3వేల 787 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8వేల 397 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కోటి దాటిన కరోనా పరీక్షలు....
రాష్ట్రంలో కొత్తగా 620 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,67,683 కి చేరింది. తాజాగా మహమ్మారి బారిన పడి మరో 7 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,988కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు