ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాటుకు దినసరి కూలీలు విలవిల - Corona bite daily wages vilavila

గుంటూరు జిల్లాకు చెందిన కూలీలను కరోనా మహమ్మారి కకావికలం చేసింది. ఉపాధి లేక పస్తులుండే పరిస్థితి తీసుకొచ్చింది. కరోనా కారణంగా పూటగడవటం కష్టంగా ఉందని కూలీలు వాపోతున్నారు.

కరోనా కాటు దినసరి కూలీలు విలవిల
కరోనా కాటు దినసరి కూలీలు విలవిల

By

Published : Apr 16, 2020, 8:16 PM IST

కరోనా మహమ్మారి పేదల బతుకులను కకావికలం చేసింది. రెక్కడితేగాని డొక్కాడని జీవితాలను ఛిద్రం చేసింది. ఉపాధి లేక పస్తులుండేలా చేసింది. కరోనా కారణంగా తమకు పూటగడవటం కష్టంగా ఉందని గుంటూరు జిల్లా సమ్మర్​పేట, రామాంజనేయపేటకు చెందిన పలువురు కూలీలు వాపోతున్నారు. తిందామంటే తిండిలేక, బయటకెళితే పనిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details