కృష్ణాజిల్లా గన్నవరం శివారులోని చెంచుల కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. తూర్పు ఏసీపీ విజయపాల్, సీఐ శివాజీ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు సరైన ఆధారాలు చూపిస్తే వారికి వాహనాన్ని తిరిగి ఇస్తామని... లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గన్నవరం శివారు కాలనీలో కార్డెన్ సెర్చ్.... 40ద్విచక్ర వాహనాలు స్వాధీనం - నిర్బంధ తనిఖీల వార్తలు
కృష్ణాజిల్లా గన్నవరం శివారు ప్రాంతంలోని చెంచుల కాలనీలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలభై ద్విచక్ర వాహనాలను, ఓ వ్యక్తి వద్ద తొమ్మిది మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
కార్డెన్ సెర్చ్
గ్రామంలోని ఓ వ్యక్తి వద్ద తొమ్మిది మద్యం సీసాలు దొరికినట్లు చెప్పారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సుమారు మూడు గంటలపాటు తనిఖీలు కొనసాగించినట్లు చెప్పారు. ప్రజలకు భద్రతాభావం, పోలీసులపై నమ్మకం, భరోసా కల్పించేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:Tadepalli Incident : 'త్వరలోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతాం'