ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షం కోసం.. పత్తి రైతుల ఎదురుచూపులు

అరకొరగా కురిసిన వానకు రైతులు పత్తి విత్తానాలు నాటారు. పనులు మొదలుపెట్టాక.. వర్షాలు లేక విత్తు మొలకెత్తక రెండోసారి నాటడనికి డబ్బులులేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పశ్చిమ కృష్ణా జిల్లా లోని పత్తి రైతుల దీన గాథ.

నీరు లేక మొలకెత్తని పత్తి గింజలు

By

Published : Jul 7, 2019, 10:58 PM IST

పత్తిరైతుల కష్టాలు...

కృష్ణా జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. వర్షాలు లేక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పశ్చిమ కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పంటలు సాగుచేస్తున్న రైతులు వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు చాలా మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు . ఆ తర్వాత వర్షాలు పడని కారణంగా... విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోతున్నారు. కొందరు రైతులు రెండోసారి విత్తనాలను నాటి మరింత నష్టపోయారు.

భూమి పూర్తి స్థాయిలో పదును అయ్యేలా వర్షపాతం లేని కారణంగా... పత్తి గింజలు సగం మేర నాని భూమిలోనే నాశనం అవుతున్నాయి. పశ్చిమ కృష్ణాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు ప్రాంతాల్లో పత్తి పంట సుమారు 60 వేల ఎకరాల్లో సాగులో ఉంది. రైతులు సగం మేర విత్తనాలు నాటి నష్టపోయారు. అక్కడక్కడ చిన్న నీటి వనరులు బోర్లు బావులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన రెయిన్ గన్ స్ప్రింక్లర్లు రైతులకు అందుబాటులో లేవు. ప్రభుత్వం స్పందించి వాటిని ఉచితంగా గాని, రాయితీ పైన గాని అందజేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి విజయవాడలో ట్రాఫిక్ కష్టాలపై ప్రభుత్వం దృష్టి

ABOUT THE AUTHOR

...view details