భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై అనవసర వివాదం సరికాదని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
అఖిలపక్ష సమావేశంపై వివాదం సరికాదు: సీఎం జగన్ - అఖిలపక్ష వివాదంపై సీఎం జగన్ స్పందన
భారత భూభాగాలు ఆక్రమణలకు గురికాలేదంటూ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ సమయంలో అనవసర వివాదం సరికాదని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాని, కేంద్ర మంత్రులు ఆమోదయోగ్యమైన సమాధానాలిచ్చారని ట్వీట్ చేశారు.
![అఖిలపక్ష సమావేశంపై వివాదం సరికాదు: సీఎం జగన్ cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7704241-895-7704241-1592685556999.jpg)
cm jagan
'ఇది మన ఐక్యతను చాటాల్సిన, సాయుధ దళాలకు సంఘీభావం ప్రకటించాల్సిన తరుణం. లోపాలను ఎత్తి చూపేందుకు ఇది సమయం కాదు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాని, కేంద్ర మంత్రులు ఆమోదయోగ్యమైన సమాధానాలిచ్చారు. ఈ ఆంశంపై జాతి మొత్తం సమైక్యంగా నిలబడాలి. ఐక్యతే బలం. విభేదాలు మన బలహీనతలను బయటపెడతాయి' అని ఆయన శనివారం ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి