కృష్ణా జిల్లా ముసునూరులో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వివాదం నెలకొంది. వైకాపా నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటు అడిగేటప్పడు.. ఓ వ్యక్తి మా గ్రామంలో డ్రైనేజీలు లేవు అని పెరుచర్ల శివ నాగరాజు నిలదీశారు. ప్రచారంలో ఉన్నవారు వెళ్లిపోయారు. వైకాపాకు చెందిన నలుగురు వ్యక్తులు వెనక్కి వచ్చి శివ నాగరాజుపై దాడి చేశారు. బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. శివ నాగరాజును నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో వివాదం - నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో వివాదం
కృష్ణా జిల్లా ముసునూరులో నాలుగవ దశ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వివాదం జరిగింది. వైకాపా నాయకులు ప్రచారం చేస్తుండగా.. ఓ వ్యక్తి వచ్చి మా గ్రామంలో డ్రైనేజీలు లేవు అని నిలదీశారు. దీంతో వైకాపాకు చెందిన నలుగురు వ్యక్తులు వెనక్కి.. వచ్చి శివా నాగరాజుపై దాడి చేశారు.
నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో వివాదం