విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి.. రైతులతో సమావేశమైంది. రైతుల పొలాల మీదుగా హైటెన్షన్ లైన్లు వేసిన అధికారులు ఇప్పటికి పలువురికి పరిహారం ఇవ్వకపోవడంతో పాటు ఇతర సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సందర్భంగా.. రైతులకు, విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డికి స్వల్ప వాగ్వాదం తలెత్తింది. తమకు ఇప్పటికీ పరిహారం అందలేదని రైతులు వాపోయారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని ఆందోళనకు దిగారు. భూసేకరణ చట్టం ప్రకారమే హైటెన్షన్ లైన్లు వేసిన చోట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల పెంపు లేదని చెబుతూనే ప్రభుత్వం అదనపు లోడు పేరుతో ఛార్జీల మోత మోగిస్తోందని సీపీఎం నేత బాబురావు ఈఆర్సీ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యపై స్పందించిన ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి... విద్యుత్ నియంత్రణ మండలికి కొంత పరిధి ఉంటుందన్నారు. తమ పరిధిలోని సమస్యలకే న్యాయం చేయగలమని వివరణ ఇచ్చారు. రైతులు సంబంధిత కార్యాలయానికి వెళ్లి తమ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో గందరోగోళం - Controversy between farmers and the aperc in vijaywada
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సమావేశంలో రైతులకు, ఈఆర్సీకి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో గందరోగోళం