ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెండింగ్​​ వేతనాలను వెంటనే చెల్లించాలి' - ఒప్పంద పీఈటీ ఉపాధ్యాయుల సమస్యలు

ఏడాదిగా పెండింగ్​లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒప్పంద వ్యాయమ ఉపాధ్యాయులు నిరసనలు చేపట్టారు. కృష్ణా జిల్లాలోని కుంచనపల్లి, తాడేపల్లిలో ఆందోళన చేశారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

contract PET teachers protest krishna dist
పెండింగ్​లోని​ వేతనాలను వెంటనే చెల్లించాలి

By

Published : Oct 12, 2020, 9:00 PM IST

పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లాలోని కుంచనపల్లి బైపాస్, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు.

13 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల కష్టాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టు పీఈటీలు కోరారు. హోర్టింగ్ ఎక్కిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details