కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి నిరసనకు దిగింది. నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం మెయిన్ గేటు వద్ద.. విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. ఉద్యోగుల సమస్యల గురించి ప్రభుత్వం స్పందిండం లేదని.. అందుకు నిరసనగా ఈ నెల 24 వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు జరపాలని జాక్ నిర్ణయించిందని తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రం,. ఆర్టీపీపీలో ఉన్న అన్ని యూనిట్లు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాలని.. డిస్కంల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంట్రక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని కోరారు.
ఒప్పంద విద్యుత్ ఉద్యోగుల నిరసన
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం మెయిన్ గేటు ఎదుట నిరసన చేశారు.
కాంట్రక్ట్ విద్యుత్ ఉద్యోగుల నిరసన
TAGGED:
కృష్ణా జిల్లా వార్తలు