వినియోగదారులకు వారి హక్కులపై అవగాహన అవసరమని వినియోగదారుల హక్కుల సంస్థ కో ఆర్డినేటర్లు తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా మోపిదేవిలో వినియోగదారుల హక్కుల సంస్థ (సీఆర్వో ఇండియా) రాష్ట్ర, జిల్లా మీడియా కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరు వినియోగదారులేనని.. ప్రతి వినియోగదారుడు వారి హక్కులకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోపిదేవి తహసీల్దార్ కె.మస్తాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా మీడియా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
'వినియోగదారులు వారి హక్కులను తెలుసుకోవాలి' - జాతీయ వినియోగదారుల దినోత్సవం
వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని వినియోగదారుల హక్కుల సంస్థ పేర్కొంది. వినియోగదారులకు వారి హక్కులపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని వారు తెలిపారు.
'వినియోగదారులు వారి హక్కులను తెలుసుకోవాలి'