Helping Hearts Group: కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన యువకులు ఉద్యోగరీత్యా వేరే ఊర్లలో స్థిరపడ్డారు. అయితే గ్రామ సెంటర్లో శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. హెల్పింగ్ హార్ట్స్ గ్రూపుగా ఏర్పడి వారు సేకరించిన నిధులతో మందిరాన్ని నిర్మించారు. రెండేళ్ల క్రితం యువకుల్లో వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టి 2021 జనవరి 7వ తేదీన గ్రామస్థుల సహకారంతో శ్రీ కృష్ణ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో మందిర నిర్మాణానికి అనేక అవరోధాలు ఏర్పడిన, యువకులు వెనకడుగు వేయకుండా పట్టుదలతో పూర్తి చేశారు.
"ఆలోచనను ఆచరణలో పెట్టారు.. గుడి నిర్మించారు..." - కృష్ణా జిల్లా పెదపారుపూడి శ్రీ కృష్ణ మందిరం
Helping Hearts Group: నేటి యువత అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయడం లేదు. కానీ ఇక్కడి యువత మాత్రం ఒక బృందంగా ఏర్పడి దాతల సహకారంతో వారి గ్రామంలో కృష్ణ మందిరాన్ని నిర్మించారు. బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం నిర్ణయించారు. మరి మనమూ ఆ సంస్థ గురించి, ఊరు గురించి తెలుసుకుందామా?
బుధవారం ప్రతిష్ఠాపన: భక్తులు, గ్రామస్థుల సహకారంతో నిర్మాణం పూర్తి చేసుకున్న శ్రీ కృష్ణ మందిరంలో విగ్రహ ప్రతిష్టకు ముహుర్తం నిర్ణయించారు. రేపు ఉదయం తొమిది గంటల రెండు నిమిషాలకు వేదపండితుల పర్యవేక్షణలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతాయని హెల్పింగ్ హార్ట్స్ సభ్యుడు జాజుల నవీన్ కుమార్ తెలిపారు. ప్రతిష్ట వేడుకల అనంతరం అఖండ అన్నసమారాధన, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి గ్రామోత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. పెదపారుపూడి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రతిష్ట ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీ కృష్ణ మందిరం భక్త బృందం సభ్యులు ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:ABV Rao: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీకి సర్కార్ షోకాజ్ నోటీసు