ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగిన నందిగామ బైపాస్ రోడ్డు నిర్మాణం.. ఇబ్బందుల బాటలో ప్రయాణం! - Construction of Nandigama Bypass Road stoped

కృష్ణా జిల్లా నందిగామ వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. రైతుల నుంచి భూసేకరణ పూర్తికాకపోవడంతో కిలోమీటర్ల మేర నిర్మాణ పనులను ఆగిపోయాయి. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Construction of Nandigama Bypass Road
నందిగామ బైపాస్ రోడ్డు నిర్మాణం

By

Published : Jul 13, 2021, 12:22 PM IST

కృష్ణా జిల్లా నందిగామ వద్ద హైవే జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం కిలోమీటర్ మేర ఆగిపోయింది. ఆ ప్రాంతంలో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిలో నందిగామ వద్ద ఏడు కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మించారు. ఆరు వరుసలుగా నందిగామ మండల అనాసాగరం నుంచి నందిగామ శివారు అంబర్​పేట అడ్డ రోడ్డు వరకు నిర్మాణం చేశారు.

పూర్తికాని భూసేకరణ..

అంబర్​పేట రోడ్డు వద్ద రైతుల నుంచి భూసేకరణ పూర్తికాకపోవడంతో కిలోమీటర్ల మేర నిర్మాణ పనులను ఆగిపోయాయి. ఈ ప్రాంతంలో వెహికల్ అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి అనుగుణంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో వెహికిల్ అండర్ ప్రాసెస్ బ్రిడ్జి కింద వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. రెండు లైన్ల రోడ్​లోనే హైదరాబాద్ -విజయవాడ వైపు వాహనాలు రాకపోకలు చేస్తుండటంతో తరచు ట్రాఫిక్ స్తంభించి పోతుంది. ఈ పరిస్థితికి తోడు ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. గత ఆరు నెలల వ్యవధిలో జాతీయ రహదారిపై 8 రోడ్డు ప్రమాదాలు జరగ్గా ఆరుగురు మృతి చెందారు. పది మందికి గాయాలయ్యాయి.

నిర్మాణంలో సర్వీస్ రోడ్డు..

చందాపురం క్రాస్ రోడ్డు వద్ద నందిగామ నుంచి బైపాస్ రోడ్డు వెళ్లే సర్వీస్ రహదారి నిర్మాణం ఇప్పుటి వరకు పూర్తి కాలేదు. నందిగామ నుంచి చందాపురం వెహికిల్ అండర్ ప్రైస్ బ్రిడ్జి మీదికి వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల చిన్న చిన్న పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే హైవే బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వాన్ని వెంటాడుతున్న.. బాక్సైట్‌ ఖనిజం ఒప్పంద ఉల్లంఘనలు!

ABOUT THE AUTHOR

...view details