కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గోరపర్తి జగ్గయ్య భార్య గొరిపర్తి సుధారాణి (33) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇంట్లోనే ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె చనిపోయి ఉండగా గుర్తించామని అవనిగడ్డ సీఐ బీ. భీమేశ్వర్ రవికుమార్ తెలిపారు.
పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ దంపతులు నాగాయలంకలోని సాలిపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.