కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన నాగరాజు అనే కానిస్టేబుల్ పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఘటన సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై చంద్రశేఖర్ బాధితుడిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.
కానీ.. నాగరాజు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.