ముఖ్యమంత్రి జగన్ తన ప్రమాణస్వీకారం రోజు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేక పోతున్నారని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి అవ్వా, తాతలకు తాను పెద్ద మనవడిగా అండగా ఉంటానన్న జగన్ మాటలు నీటి మూటలుగా మిగులుతున్నాయన్నారు. వారికి ఈ సంవత్సరం పెంచాల్సిన పింఛన్ ఇంతవరకు పెంచలేదని విమర్శించారు. వైఎస్సార్ జయంతికి పెంచుతారని అవ్వా తాతలు ఆశలు పెట్టుకున్నారని.. వారి ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు చల్లారని మండిపడ్డారు. సెప్టెంబర్ నుంచి అయిన పింఛను పెంచి రూ. 2500 చెల్లించాలని డిమాండ్ చేశారు.
'పింఛన్ ఇప్పటివరకు ఎందుకు పెంచి ఇవ్వలేదు' - సీఎం జగన్పై సుంకర పద్మశ్రీ విమర్శలు
అవ్వా తాతలకు పెంచి ఇస్తానన్న పింఛను ఏమైందని సీఎం జగన్ను.. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. ఇప్పటికే 2 నెలల డబ్బులు నష్టపోయారని.. సెప్టెంబర్ నుంచి అయినా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ నేత