కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. దీనిని నిరసిస్తూ 29న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని అన్నారు. ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలను నియంత్రణ చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కొవిడ్ బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సీజన్ అందించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. మెడికల్ మాఫియాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగుల కుటుంబాలను దోచుకుంటున్నాయని ఆక్షేపించారు.
రేపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన - ap congress protest
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. 29న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నామని ..అందరూ ఆందోళనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్