వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కోసం శ్రీదేవి ఏడ్చటం ఆశ్ఛర్యం కల్గిస్తోందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల గుండెలు ఆగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇంటి పెద్దను పోగొట్టుకుని, అన్నం పెడుతున్న భూమిని కోల్పోయి రైతు కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తుంటే అప్పుడు ఏం చేస్తున్నావు అని నిలదీశారు. ముఖ్యమంత్రికి భజన చెయ్యటానికి మత్రమే మీరు మీడియా ముందుకు వస్తారా అని ప్రశ్నించారు. మిమ్మల్ని కాపాడుకోవటం కోసం, జగనన్న కోసమే కన్నీళ్లు వస్తాయా అని మండిపడ్డారు. నీ నియోజకవర్గంలో రాజధాని మహిళలను రక్తం వచ్చేలా కొట్టినప్పుడు ఏమైంది ఈ బాధ అన్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలు పెట్టిన కన్నీరే వైకాపా పతనానికి నాంది అన్నారు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్న సంగతి వైకాపా నాయకులు తెలుసుకోవాలన్నారు. ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించాలని తన ప్రకటనలో డిమాండ్ చేశారు.
'సీఎం కోసం శ్రీదేవి కన్నీరు కార్చటం ఆశ్చర్యం కల్గిస్తోంది' - ఏపీలో వైకాపా ఎమ్మెల్యే కన్నీరు
తాడికొండ వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముఖ్యమంత్రి జగన్ కోసం కన్నీరు కార్చడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఎద్దేవా చేశారు. రైతులు రాజధాని కోసం భూములిచ్చి గుండెపోటుతో మరణించినప్పుడు తమరు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రేమే ఉండాలని తన ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ