ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సీ, ఎస్టీలపై దాడులకు వ్యతిరేకంగా రేపటి నుంచి కాంగ్రెస్ నిరసన - ఏపీలో దళితుల మీద దాడిపై వార్తలు

రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీలపై దాడులను వ్యతిరేకిస్తూ.. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టనుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఈ దుర్ఘటనలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు.

congress protest against attack on dalith's
ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్

By

Published : Jul 23, 2020, 4:55 PM IST

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ రేపటి నుంచి కాంగ్రేస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. బలహీనవర్గాల రక్షణ కోసం అట్రాసిటీ సెక్షన్ తెచ్చింది కాంగ్రేస్ పార్టీ అని గర్వాంగా ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసు స్టేషన్ లో యువకుడికి శిరోముండనం తెలుగు జాతికి అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్, అనిత,మేజిస్ట్రేట్ రామకృష్ణ, వరప్రసాద్​పై దాడులు దుర్మార్గమన్నారు.

ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు హక్కులు ఉన్నాయని గుర్తించాలని శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ సెల్​కి అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీఎస్టీలపై జరుగుతున్న దాడుల పై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.

ఇదీ చదవండి: రాజధాని బిల్లుల వ్యవహారంపై వివరాలు కోరిన పీఎంఓ

ABOUT THE AUTHOR

...view details