Congress meeting: కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలోని ఆంధ్రాభవన్‌లో జరిగింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఈ సమావేశంలో చర్చించినట్లు సీనియర్ నాయకుడు తులసీరెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకురావడానికి అందరం కలిసి కృషి చేస్తామన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సీనియర్ నాయకులు పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, కనుమూరు బాపిరాజు, మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశం - tulasi reddy meeting in vijayawada
Congress meeting: కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలోని ఆంధ్రాభవన్‌లో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకురావడానికి అందరం కలిసి కృషి చేస్తామని సీనియర్ నాయకులు తులసీరెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సమావేశం