ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించటం సరికాదు' - విజయవాడ తాజా వార్తలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలజానాధ్ 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని రక్షించండి' అంటూ విజయవాడలో ఆంధ్రరత్న భవన్ ఎదుట బైటాయించి నినాదాలు చేసారు.

విజయవాడలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలజానాధ్ నిరసన
విజయవాడలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలజానాధ్ నిరసన

By

Published : Jul 27, 2020, 6:13 PM IST

'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. రాజ్యాంగాన్ని రక్షించండి' అంటూ విజయవాడలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలజానాధ్ నిరసనకు దిగారు. ఆంధ్రరత్న భవన్ నుంచి గవర్నర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆంధ్రరత్న భవన్ ఎదుట బైఠాయించి మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తుందని నినాదాలు చేసారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొడుతుందని శైలజానాధ్ ఆరోపించారు. కరోనా నివారణ చర్యలు చేపట్టకుండా కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. రాజస్థాన్ అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details