కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వేల్పుల పరమేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక పశు వైద్యశాల ఆవరణలో మాట్లాడుతుండగా.. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు.
కాంగ్రెస్ నాయకుడు వేల్పుల పరమేశ్వరరావు గుండెపోటుతో మృతి - Congress party in-charge dies of heart attack
నందిగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వేల్పుల పరమేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వెల్పుల మృతి అందరినీ కలిచివేసింది.
కాంగ్రెస్ నాయకుడు వేల్పుల పరమేశ్వరరావు గుండెపోటుతో మృతి
పరమేశ్వరరావు నందిగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. చందర్లపాడు మండలం జిల్లా పరిషత్ సభ్యుడిగా ఐదేళ్లు పని చేశారు. నందిగామ కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పరమేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో ఆప్యాయంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే వెల్పుల మృతి అందరినీ కలిచివేసింది.