పెట్రోల్ ధరలపై ప్రజలు గగ్గోలు పెడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతుకు తాడు కట్టి ద్విచక్రవాహనాన్ని లాగించి వినూత్నగా నిరసన తెలిపారు. కరోనాతో కష్టాల్లో ఉన్న ప్రజలకు చమురు ధరలతో అదనపు భారం పడుతోందన్నారు. ఇష్టానుసారం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆమె మండిపడ్డారు.
చమురు ధరల పెంపుపై.. వాహనాన్ని దున్నపోతుతో లాగిస్తూ నిరసన - పెట్రోల్, డీజిల్ ధరల పెంపు న్యూస్
ఇంధన ధరల మోత మోగుతోంది. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా.. మన దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లుపడుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వినూత్న నిరసన తెలిపారు.
congress leaders