ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, అమరావతికి నిధులు రాబట్టడంలో వైకాపా ఎంపీలు విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు అన్నారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా విజయవాడలో ఏఐసీసీ సభ్యుడు నరహరశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద సీఎం జగన్ తాకట్టు పెట్టారని నేతలు ఆరోపించారు.
'సీఎం సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాడు ' - విజయవాడలో కాంగ్రెస్ నేతల నిరసన
విభజన హామీలు సాధించడంలో వైకాపా ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పిలుపుమేరకు కృష్ణా జిల్లా విజయవాడలో బడ్జెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు
విజయవాడలో కాంగ్రెస్ నేతల ధర్నా
బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్ వంటి ఏ ఒక్క అంశం కూడా లేకపోవడం దారుణమన్నారు. తెలుగు ప్రజలను అవమానపరిచేలా బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం మెడలు వంచుతానని చెప్పిన జగన్.. ప్రధాని వద్దకు వెళ్లి మెడలు వంచుకుని నిలబడుతున్నారన్నారు. తక్షణమే ఎంపీలు రాజీనామా చేయాలన్నారు.
ఇదీ చూడండి.'కచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు ఈ పాట్లన్నీ ఎందుకు ?'