రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లోని కాపు మహిళలకు... కాపు నేస్తం పథకం ఎందుకు వర్తింపచేయరని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న పేద కాపు మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు చేపట్టిన ఈ పథకాన్ని... 13 జిల్లాల్లో అర్హులైన వారందరికీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలో అర్హులైనవారు ఒక్కరైనా లేకపోవటం శోచనీయమన్నారు. ప్రభుత్వం తక్షణమే రాయలసీమ జిల్లాల్లో రీసర్వే చేయించి అర్హులకు కాపునేస్తం పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వారికి కాపు నేస్తం పథకం ఎందుకు వర్తింపచేయరు: తులసిరెడ్డి - కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వార్తలు
వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లోని కాపు మహిళలకు... కాపు నేస్తం పథకం ఎందుకు వర్తింపచేయరని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. పేద కాపు మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు చేపట్టిన ఈ పథకాన్ని... 13 జిల్లాల్లో అర్హులైన వారందరికీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
కాపు నేస్తం పథకంతో మహిళలను ఆదుకోవాలన్న తులసిరెడ్డి