రాజశేఖర రెడ్డి రైతును రాజును చేయాలని చూస్తే .. జగన్ మాత్రం బిచ్చగాడిగా చేయాలని చూస్తున్నారని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. విజయవాడలోఆమె మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయినా దగ్గర నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పండించిన పంట అమ్ముకోలేక.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అయోమయంలో రైతు ఉన్నారన్నారు.
'అమరావతిని తరలించాలనే కుట్రలో భాగమే.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు' - విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు వార్తలు
వైకాపా ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించడం హాస్యాస్పదమని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అమరావతిని తరలించాలనే కుట్రలో భాగమే విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు అని మండిపడ్డారు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం 29 వేలమంది అన్నదాతలు తమకు అన్నం పెట్టే 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు రాజధాని మార్పు అంటూ 29వేల రైతు కుటుంబాల చేత కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. అమరావతిని తరలించాలనే కుట్రలో భాగమే విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు అన్నారు. రాత్రికి రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. అమరావతిలోనే అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరగాలి... విగ్రహ ఏర్పాటు పేరుతో దళితుల మనోభావాలతో ఆడుకోవద్దని సూచించారు. అమరావతిపై భాజపా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి.జీవో 56ను అమలు చేయాలి.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు