ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని విషయంలో భాజపా నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు - సుంకర పద్మశ్రీ వార్తలు

సోము వీర్రాజు రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరవాత... భాజపా కార్యకర్తల కంటే వైకాపా నాయకులే ఎక్కువ సంతోషపడుతున్నారని... అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ అన్నారు.

conmgress leader padmasri fires on bjp
రాజధాని విషయంలో భాజపా నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు

By

Published : Jul 31, 2020, 11:33 AM IST

సోము వీర్రాజు రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరవాత... భాజపా కార్యకర్తల కంటే వైకాపా నాయకులే ఎక్కువ సంతోషపడుతున్నారని... అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ అన్నారు.

అమరావతి రాజధాని విషయంలో మొదటి నుంచి భాజపా నేతలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. మేము అమరావతికి మద్దతు ఇస్తున్నాం.... ప్రపంచ స్థాయి రాజధాని కట్టుకోండి మేము సహకారం అందిస్తామని భాజపా నేతలు చెప్పలేదా అని పద్మశ్రీ ప్రశ్నించారు. చంద్రబాబు ఆహ్వానిస్తే అమరావతి శంకుస్థాపనకి ప్రధానమంత్రి వచ్చారని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గమన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రజలు కారా.. వారివి ప్రజా సమస్యలు కావా అని మండిపడ్డారు.

అమరావతికి మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చిన లేఖను సోము వీర్రాజు వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పిన మాటలను సోము వీర్రాజు మరచిపోయారా అన్నారు. మీ చేతితో ప్రాణం పోసుకున్న అమరావతిని ముఖ్యమంత్రి జగన్ చంపాలని చూస్తుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. రాష్ట్ర రాజధాని విషయంలో భాజపా జోక్యం చేసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

సోము వీర్రాజు అలా.. సుజనా ఇలా.. ట్విట్టర్​లో మరోలా..!

ABOUT THE AUTHOR

...view details