జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. కరోనా ప్రభావంతో ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై మరింత భారం వేస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాలు మాట దేవుడెరుగు నవ వాయింపులకు వైకాపా ప్రభుత్వం పాల్పడుతుందని ఎద్దేవా చేశారు. మద్యం, సిమెంట్, ఇసుక, ఆర్టీసీ, విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారని ధ్వజమెత్తారు. జగన్ రావాలి... జగన్ కావాలి అని ప్రజలు కోరుకున్నందుకు... ధరలు పెంచి ప్రజలకు వడ్డిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలు అర్ధం చేసుకోవాలని తులసిరెడ్డి హితవు పలికారు.
'జగన్ కావాలనుకున్న ప్రజలపై ధరలు పెంచి వడ్డిస్తున్నారు'
రాష్ట్రంలో అన్ని ధరలను పెంచేసి.. ప్రజలపై జగన్ ప్రభుత్వం మరింత భారం వేస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. జగన్ రావాలి... జగన్ కావాలి అనుకున్న ప్రజలపై ధరలు పెంచి వడ్డిస్తున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్పై తులసిరెడ్డి మండిపాటు