ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాంగ్రెస్ తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం' - కాంగ్రెస్

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని విజయవాడ లోక్​సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరహరి శెట్టి నరసింహరావు చెప్పారు. కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ అభ్యర్థి బొర్రా కిరణ్​తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.

మైలవరంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

By

Published : Apr 4, 2019, 6:23 PM IST

మైలవరంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తేనేరాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని విజయవాడ లోక్​సభ నియోజకవర్గ కాంగ్రెస్అభ్యర్థి నరహరి శెట్టి నరసింహరావు చెప్పారు. కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ అభ్యర్థి బొర్రా కిరణ్​తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఇతర పార్టీలన్నీ డబ్బు ఖర్చు పెట్టేఅభ్యర్థులకు సీట్లుకేటాయించాయని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం సామాన్య కార్యకర్తలకు టికెట్ ఇచ్చిందని చెప్పారు. ఓటు వేసి తనను గెలిపిస్తే... నియోజకవర్గ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details