ముంబయిలో డాక్టర్ అంబేడ్కర్ నివాసం రాజగృహపై దాడి చేసిన వారిని తక్షణమే గుర్తించి వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.
'వారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలి' - అంబేద్కర్ ఇంటిపై దాడి న్యూస్
రాజగృహపై దాడిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులను వెంటనే గుర్తించి దేశద్రోహం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
!['వారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలి' congress agitation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8021364-606-8021364-1594727914996.jpg)
రాజగృహపై జరిగిన దాడిని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఖండించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి , పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధాని, మహారాష్ట్ర సీఎంకు వేర్వేరుగా లేఖలు పంపిస్తామని వెల్లడించారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'మానసాస్ ట్రస్టు యాజమాన్య వ్యవహారాల్లో జోక్యం మానుకోండి'