కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద వంగవీటి రాధ, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ చౌదరి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏలూరు వైపు నుంచి విజయవాడ వస్తున్న ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, వంగవీటి రాధా వాహనాలు..ఒకరినొకరు అధిగమించే క్రమంలో వివాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధ వర్గీయుల వాగ్వాదం...ఎందుకంటే..! - vnagaveeti radha issues latest news
వాహన శ్రేణుల మధ్య పోటీ.. వంగవీటి రాధ, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ చౌదరి వర్గీయుల మధ్య చిచ్చు రేపింది. ఏలూరు వైపు నుంచి విజయవాడ వస్తున్న ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, వంగవీటి రాధా వాహన శ్రేణులు.. ఒకదానికి ఒకటి అధిగమించే క్రమంలో పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద ఇరు వర్గాలు గొడవకు దిగాయి.
వంగవీటి రాధ, దెందులూరు ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వాగ్వాదం..
పోలీసుల జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇద్దరు నాయకులు ఒకే కారులో విజయవాడకు వెళ్లారు.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల ప్రకటనపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం