కృష్ణా జిల్లాలో విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ కాస్త పెరిగి రెండు వర్గాల మధ్య దాడిగా మారింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు.
విద్యార్థుల మధ్య మొదలై... రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి - krishna district latest news
విద్యార్థుల మధ్య మాటా మాటా పెరిగి చివరికి రెండు వర్గాల మధ్య దాడిగా పరిణమించిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
విద్యార్థుల మధ్య మొదలై... రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి
నూజివీడు మండలం కొత్తూరు తండా, సిద్ధార్థ నగర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు నూజివీడు కళాశాలలో చదువుతున్నారు. ఇళ్లకు తిరుగు ప్రయాణంలో బస్సులో రెండు ఊళ్లకు చెందిన విద్యార్థుల మధ్య మాటా మాటా పెరిగింది. అందులో ఏకంగా ఇరు గ్రామాల పెద్దలు సైతం జోక్యం చేసుకొని రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి