కృష్ణా జిల్లా కొండపల్లి గిరిజన పాఠశాలలో వసతి పొందుతున్న ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారులు అందించిన ఆహారాన్ని తిరస్కరించారు. కేంద్రం తరలింపుపై సడలింపులు ఇచ్చినందున ప్రభుత్వాలు స్పందించి తమను స్వస్థలాలకు తరలించాలని వేడుకుంటున్నారు.
'కేంద్రం సడలింపులు ఇచ్చిందిగా.. మమ్మల్ని తరలించండి' - కృష్ణా జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
తమను సొంత రాష్ట్రాలకు పంపించాలని కృష్ణా జిల్లా కొండపల్లిలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. కేంద్రం సడలింపులు ఇచ్చినందున ప్రభుత్వం తమకు సహాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.
కొండపల్లిలో వలస కూలీల ఆందోళన