ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు చెల్లించకుండా.. ఆలస్యం చేస్తోందని పెనమలూరు నియోజకవర్గ తెదేపా ఇంచార్జి, మాజీ శాసనసభ్యుడు బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో కంకిపాడు మండల వ్యవసాయాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి: బోడె ప్రసాద్ - Former legislator Bode Prasad news
కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా రైతులను ప్రభుత్వం కష్టపెడుతుందని మాజీ శాసనసభ్యుడు బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడు వ్యవసాయాధికారికి వినతి పత్రం సమర్పించారు.
ధాన్యం డబ్బులు చెల్లించాలని ఆందోళన