ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోజాతీయ విద్యా విధానం 2020 సామాజిక న్యాయం అంశంపై విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నూతన విద్యా విధానం తయారుచేయడానికి కేంద్రం కస్తూరి రంగన్ కమిటీ వేసిందని.. కమిటీ సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా పార్లమెంట్.. కొత్త విధానాన్ని ఆమోదించటం సరికాదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ అన్నారు.
'జాతీయ నూతన విద్యా విధానంపై సమగ్ర చర్చ జరగాలి' - latest news new education policy
జాతీయ నూతన విద్యా విధానంపై సమగ్రమైన చర్చ జరగకుండా ఏకపక్షంగా ఆమోదించడాన్ని ఖండిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ అన్నారు. నూతన విద్య విధానంపై సమగ్ర చర్చ జరగాలని అన్ని విశ్వవిద్యాలయాలు, మేధావుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'జాతీయ నూతన విద్యా విధానంపై సమగ్ర చర్చ జరపాలి'
నిర్బంధ ఉచిత విద్యా హక్కు అంశం ఈ నూతన విద్యా విధానంలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదో తరగతి నుంచే వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెట్టడం వలన పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించకుండా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్య విధానంపై సమగ్ర చర్చ జరగాలని అన్ని విశ్వవిద్యాలయాల, మేధావుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.
ఇవీ చదవండి