ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్నేరు ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తి చేస్తాం : విప్ ఉదయభాను - Munnaru Dam

ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కృష్ణా జిల్లాలోని మున్నేరు ఆనకట్టను పరిశీలించారు. ప్రాజెక్ట్​ను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్​నుంచి పట్టణ కాలువకు సాగునీరు విడుదల చేశారు.

మున్నేరు ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తి చేస్తా

By

Published : Aug 3, 2019, 8:45 PM IST

కృష్ణా జిల్లాలోని మున్నేరు ఆనకట్టను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. 20 వేల ఎకరాలకు సాగునీరందించే ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఆనకట్ట వద్ద నీటి నిల్వకు అవసరమైన కరకట్టల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం, ఆ ప్రాంత రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసంపూర్తిగా మిలిగిపోయిన ప్రాజెక్ట్​ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నుంచి పట్టణ కాలువకు సాగునీరు విడుదల చేశారు.

మున్నేరు ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తి చేస్తా

ABOUT THE AUTHOR

...view details