ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవనిగడ్డలో పెరుగుతున్న కరోనా కేసులు..పూర్తిస్థాయి లాక్​డౌన్ - krishna district latest news

అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో ఆదివారం పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. మెడికల్ దుకాణాలకు తప్ప… ఇతర దుకాణాలకు అనుమతులు ఇవ్వలేదు.

lock down in Avanigadda
అవనిగడ్డలో పూర్తిస్థాయి లాక్​డౌన్

By

Published : Jul 19, 2020, 7:49 PM IST

Updated : Jul 20, 2020, 2:08 PM IST

అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో ఆదివారం పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 25 వరకు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసులు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మెడికల్ దుకాణాలకు తప్ప… ఇతర దుకాణాలకు అనుమతులు ఇవ్వలేదు. మాంసాహార విక్రయాలు నిషేధించారు. తెల్లవారుజామున లాక్ డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నాగాయలంక నుంచి ఇతర ప్రాంతాలకు పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న 12 వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కి తరలించారు.

Last Updated : Jul 20, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details