కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసిన రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాన్ని అధికారులు కాలుష్యప్రాంతంగా ప్రకటించారు. 16, 17, 18, 20, 21, 21 డివిజన్లలో పూర్తిగా లాక్డౌన్ ప్రకటించారు. ప్రజలెవ్వరూ బయటికి రావద్దని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. పలు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కిలోమీటరు పరిధిలోగల భౌగోళిక ప్రాంతాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. ఈ డివిజన్లలో 3 కలోమీటర్ల పరిధిలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. అనుమానితులను వెంటనే ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు.
రాణిగారితోటలోకి ప్రవేశించే మార్గాలైన రామలింగేశ్వరనగర్, గీతానగర్, మహితా పబ్లిక్ స్కూలు, నేతాజీ వంతెన, సబ్వే పరిసరాల్లోని వాటర్ ట్యాంక్, తారకరామనగర్ కరకట్ట పరిధిలోని రాజు వాటర్ ప్లాంట్, ఫకీర్‌గూడెం శ్మశానవాటిక తదితర ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది ప్రతీ వీధిలో బ్లీచింగ్ చల్లారు. అగ్నిమాపక వాహనం సాయంతో హైపోక్లోరెడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రజలెవ్వరు వీధుల్లోకి రావద్దంటూ మైకుల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
పానీ పూరీలు తయారు చేస్తూ...