ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అడపా శేషగిరిరావును అనర్హుడిగా ప్రకటించాలి' - vijayawada corporation election

విజయవాడ 20వ డివిజన్ వైకాపా అభ్యర్థిపై కొందరు స్థానికులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

complaint to returning officer against adapa sheshagirirao
అడపా శేషగిరిరావు

By

Published : Feb 27, 2021, 6:49 PM IST

విజయవాడ నగరపాలక ఎన్నికల్లో 20వ డివిజన్‌ వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న అడపా శేషగిరిరావును అనర్హుడిగా ప్రకటించాలంటూ.. స్థానికులు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. ముగ్గురు పిల్లలు సంతానం కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కాబట్టి... ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముగ్గురు పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details