కృష్ణాజిల్లా మైలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గత ఎన్నికలకు కేటాయించిన నిధుల విషయంలో అవకతవకలు జరిగాయని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురళీమోహన్.. జడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. స్థానిక ఎండీవో డి.సుబ్బారావు, కొందరు సిబ్బంది కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాల్సిందిగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జయచంద్ర గాంధీకి ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల నిధుల దుర్వినియోగం.. మైలవరం ఎండీవోపై ఫిర్యాదు - mylavaram latest news
కృష్ణాజిల్లా మైలవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గత ఎన్నికల నిధుల విషయంలో అవకతవకలు జరిగాయని జడ్పీ సీఈవోకు ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించి స్థానిక ఎండీవో డి.సుబ్బారావు, కొందరు సిబ్బందిపై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురళీమోహన్ ఫిర్యాదు చేశారు.
మైలవరం
రెండు రోజుల్లో పూర్తి వివరాలు జడ్పీ సీఈవోకు అందిస్తామని జయచంద్ర గాంధీ తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన మురళీమోహన్ను వివరణ కోరగా… ఉన్నతాధికారులు నిజాలు తేల్చుతారని, తానేమీ మాట్లాడలేనని చెప్పారు.
ఇదీ చదవండి:కృష్ణా వాసులకు సరిహద్దుల్లో అగచాట్లు