కృష్ణాజిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. జిల్లాలను సైతం దాటుకుంటూ వచ్చిన రైతులు.. వానలోనే తడుస్తూ న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. సీపీ మెుక్క జొన్న సీడ్స్ కంపెనీ మోసం చేసిందంటూ... సంస్థ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలోని రైతులు గత ఖరీఫ్ సీజన్లో 210 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఎకరాకు 25 నుండి 35 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని.. 50 వేల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు వారు చెప్పారు. సుమారు కోటి రూపాయల పరిహారానికి కేవలం 16 లక్షలు మాత్రమే ఇస్తానంటూ కంపెనీ ప్రకటించడం దారుణమని రైతులు వాపోయారు.
'పరిహారం కోసం.. వర్షంలోనూ అన్నదాతల ఆందోళన'
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్నదాతలు ఆందోళనకు దిగారు. పరిహారం కోసం రైతులు జిల్లాలను దాటుకుంటూ వచ్చి ఆందోళన చేపట్టారు.
వానలో అన్నదాతల ఆందోళన
ఇవీ చదవండి...వైద్యుల సమ్మె ఉద్ధృతం.. అత్యవసర సేవలూ బంద్