అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలకు వైకాపా నమ్మకద్రోహం చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. విధ్వంసంపైనే వైకాపా సర్కార్ దృష్టంతా ఉందని మండిపడ్డారు. మూడు ముక్కులాట ఆడే అధికారం వైకాపాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
రాజధాని తరలింపు విషయంపై ఎన్నికలకు వెళ్లమని సవాల్ విసిరితే స్వీకరించలేదు. అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చకు సిద్ధమంటే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అమరావతి కోసం 87మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం లెక్కలేకుండా మానవత్వం, కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. రాజధానిని 3 ముక్కలు చేసేందుకు... 251 రోజుల అమరావతి ఉద్యమానికి కులం ముద్ర వేశారు-చంద్రబాబు, తెదేపా అధినేత
తక్షణమే పరిహారం చెల్లించండి