ఏపీ మిషన్ ఫర్ క్లిన్ గోదావరి-కృష్ణా కెనాల్‌కు రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటు జిల్లా స్థాయి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి డెల్టా వ్యవస్థలోని కాలువలను శుభ్రపరచడంతో పాటు సుందరీకరణ చేయడం లక్ష్యంగా కమిటీలకు కార్యాచరణ రూపొందించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. జల వనరుల శాఖ, ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, పురపాలక, పంచాయతీ రాజ్ కమిషనర్లు సభ్యులుగా 9 మందితో టాస్క్ పోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
9 మంది సభ్యులతో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ - 9 మంది సభ్యులతో ఏపీలో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ
ఏపీ మిషన్ ఫర్ క్లీన్ గోదావరి-కృష్ణా కెనాల్‌కు టాస్క్‌ఫోర్స్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గోదావరి డెల్టా కాల్వల ఆధునికీకరణ లక్ష్యంగా కమిటీల కార్యాచరణ రూపొందించింది.
committees-for-krishna-godavari-canal-mission