పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందాలి: జిల్లా కలెక్టర్ - colletor visited mudinepally
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా లబ్దిదారులకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు.

ముదినేపల్లి మండలంలో కలెక్టర్ పర్యటన
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. ఉప్పరగూడెంలో చెరువును ,ఇళ్ల స్థలాలను ,పాఠశాలను పరిశీలించారు. ముదినేపల్లి సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టికను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు.
ముదినేపల్లి మండలంలో కలెక్టర్ పర్యటన