కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మచిలీపట్నంలో పర్యటించారు. దేశాయ్ పేట మున్సిపల్ హైస్కూల్ సందర్శించి విద్యార్థులతో కరోనా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీని దృష్ట్యా పాఠశాలలను పరిశీలించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
విద్యార్థులకు కరోనా సోకిన బడి పరిశీలించిన కలెక్టర్ - మచిలీపట్నంలో కలెక్టర్ పర్యటన
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా సోకుతున్న నేపథ్యంలో...అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. ఆ బడిన సందర్శించి విద్యార్థులకు ధైర్యం చెప్పారు. ప్రతిజ్ఞ చేయించారు.
మచిలీపట్నంలో కలెక్టర్ పర్యటన