కృష్ణా జిల్లాలో తొలివిడతగా.. 234 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను ఆయన సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిజర్వు పంచాయతీల్లో అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీలో.. జాప్యం చేయవద్దని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
కంచికచెర్ల మండలంలో ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.