Collector fires on RWS SE: కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో కలెక్టర్ రంజిత్ బాషా పర్యటించారు. వారం రోజులుగా అతిసారంతో గ్రామంలో ముగ్గురు మృతిపై ఆరా తీశారు. గ్రామంలో అధ్వానంగా ఉన్న వీధుల్లో కలెక్టర్ పర్యటించారు. తాగునీరు కలుషితం కావడం వల్లే అతిసారం కేసులు పెరిగాయని కలెక్టర్ తెలిపారు. తాగునీటి నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ లీలాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నిధులు కావాలంటే నేనిస్తా.. పనులు మొదలుపెట్టు.. మేము చెబుతుంది ఏంటి.. మీరు చేస్తుంది ఏంటీ' అంటూ మండిపడ్డారు.